రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని చాలాచోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయని చెప్పారు. గురువారం నుంచి పొడి వాతావరణం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజామున పొగమంచు కమ్ముకున్నది.
నేడు తేలికపాటి వానలు