గుజ‌రాత్‌లో మ‌రో 55 క‌రోనా కేసులు

గుజ‌రాత్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. తాజాగా మ‌రో 55 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గుజ‌రాత్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 241కి చేరింది. కొత్త‌గా న‌మోదైన 55 కేసుల‌లో 50 మంది అహ్మ‌దాబాద్‌కు చెందిన‌వారు, ఇద్ద‌రు సూర‌త్‌కు చెందిన‌వారు కాగా.. దాహోడ్‌, ఆనంద్‌, చోటా ఉదేపూర్‌ల‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నార‌ని గుజ‌రాత్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా గుజ‌రాత్‌లో రేష‌న్ కార్డులులేని వారికి ఒక్కొక్క‌రికి 10 కిలోల గోధుమ‌లు, మూడు కిలోల బియ్యం, కిలో ప‌ప్పు, కిలో చెక్క‌ర ఉచింతంగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.